ఏ భాష గొప్పదనం అయినా అది మాట్లాడు వారందరి గొప్పదనము కలిసి ఉంటుంది అని మా నమ్మకం. అయితే వెనుకటి తరం వారు బలవంతపు బానిసలవలె బ్రతికి తమ యొక్క ఆత్మ స్థైర్యాన్ని పోగొట్టుకొని అదే తమ సంతానానికి నూరిపోసారు. ఆ ఫలితంగా ప్రస్తుతం ఏ కొద్ది మందో తమ యొక్క ఉత్తమ జన్మ వలనో, తల్లి తండ్రుల వలనో, సోదర సోదరీమణుల వలనో, మిత్రుల వలనో ఉత్తేజితులై ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించుకొని, బానిసల స్వభావాన్ని పోగొట్టుకొని స్వీయంగా పుస్తకాలు రచించి, బ్లాగులు, వెబ్ సైట్లు మొదలగునవి ప్రచురించి ఎన్నో విధాలుగా తమ భాష సంస్కృతులను నిలబెట్టుకొను ప్రయత్నాన్ని చేస్తున్నారు.
అటువంటి ప్రయత్నాన్ని ప్రశంసించే ఒకానొక ప్రయత్నమే తెనుగు.ఆర్గు. ఎందరో మహానుభావులు వారందరికీ మా వందనములు. తెనుగు.ఆర్గుపై మీ సలహాలు, అభిప్రాయాలు, విమర్శలకు ఎదురుచూస్తున్నాము.
మీరు పంపవలసిన ఈమెయిలు: tenugu.org@జిమెయిల్.కాం