తమిళనాడులో 42 శాతం అప్పటపు తెలుగువారున్నారు. వారి రక్షణకోసం వున్న చట్టాలను ఏవీ ఇప్పటి ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. డి.ఎం.కె, అన్నాడి.ఎం.కెలు - తెలుగును అణచివేసే విధానాలనే అవలంబిస్తున్నాయి. ఇతర ద్రవిడ పార్టీలు ఇంకా తీవ్రవాదంతో పనిచేస్తున్నాయి. ఇతర దేశాల్లో వున్న తమిళుల వేర్పాటువాదాలను ప్రోత్సహిస్తున్న వీరంతా తమిళనాడులో అత్యధికంగా వున్న సహజ, స్వాభావిక తెలుగు వారిని, వారి భాషను అణచివేసే ప్రయత్నాలెందుకు చేస్తున్నారు? తెలుగువారిని అన్ని విధాలుగా తమిళులుగా మార్చివేసి, చరిత్రనే తల్లక్రిందులు చేసే ప్రయత్నాలెందుకు చేస్తున్నారు?
- వై. కృష్ణమరాజు, తమిళనాడు
(మే 2004 "నడుస్తున్న చరిత్ర" పత్రిక లోని "పాఠకుల పలుకులు" అనే శీర్షిక నుండి తీసుకోబడినది.)